కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం ఆగస్టు 5న మాదిగ మహా కూటమి ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం ధర్మదీక్ష పోస్టర్ ను ఆవిష్కరించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ధర్మబద్ధంగా చేస్తున్న ఉద్యమం మాదిగ ఉద్యమం అని ఏ బి సి డి వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాలలోని వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ఎన్ఎస్ఆర్ రాజు, తలారి చైతన్య, లక్ష్మణరావు, పురుషోత్తం, మాదిగ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.
