అసెంబ్లీ సెషన్ లో రాష్ట్ర వైద్య శాఖ బడ్జెట్ మరియు కోరుట్ల నియోజకవర్గ పలు సమస్యలపై అసెంబ్లీలో ప్రసంగించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.

కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డా. కల్వకుంట్ల సంజయ్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో స్థాపించిన డయాగ్నోసిస్ సెంటర్ లో అడగగానే బెడ్ల సంఖ్య పెంచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు 

మెటుపల్లి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి శిథిల వ్యవస్థలో ఉండి మొన్న కురిసిన వర్షానికి పై పెచ్చులు ఊడిపడిన సందర్భాలు ఉన్నాయి. అని ప్రజలు ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా దయచేసి  బిఆర్ఎస్ ప్రభుత్వంలో నూతన ఆసుపత్రి నిర్మాణ భవనం ప్రారంభించగా,  నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనం నిర్మాణం మధ్యలో ఉందని భవనానికి కోటి రూపాయలు మంజూరు చేయాలని,  నూతన ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తి అవుతుందని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

.