ఉపాధి కల్పించాలంటూ ఆందోళన.
అధికారులకు వినతిపత్రం.
తొమ్మిదో రోజుకు చేరిన దీక్షలు.
తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల): ఉపాధి కల్పించాలని నేతన్నలు చేసిన నినాదాలు కలెక్టరేట్ ఏరియా అంత దద్దరిల్లిపోయింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వస్త్ర పరిశ్రమ జేఏసి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన చేపట్టారు. నిరవధిక దీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. తమ నిరసనలో భాగంగా భారీగా తరలివచ్చిన నేతన్నలు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సంక్షోభంలో కూరుకుపోయిన పరిశ్రమను కాపాడాలని కోరుతూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమపై అడ్డగోలుగా విధించిన విద్యుత్ ఛార్జీలను ఎత్తివేయాలని ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ను కలిసి పరిస్థితిలను వివరించి వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో అడేపు రవి, రమేష్, సిరిసిల్ల రవీందర్, గోవింద్ రవి, దూడమ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
