అంత్యోదయ కార్డుదారులకు ద్వారా చక్కెర సరఫరా చేయండి

బియ్యం కార్ శ్రీనివాస్ ,జిల్లా పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు. 

తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల):  రేషన్ షాపుల ద్వారా అంత్యోదయ కార్డుదారులకు చక్కెర సరఫరా చేయాలని కోరుతూ జిల్లా పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యం కార్ శ్రీనివాస్ కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంవత్సరం నుండి రేషన్ షాపుల ద్వారా అంత్యోదయ కార్డులకు చెక్కర ఇవ్వడం లేదని అన్నారు. ఈ విషయంపై సివిల్ సప్లై కమిషనర్ కు ఫిర్యాదు చేస్తే ఒక్క మే నెలలో మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఈ విషయం జిల్లా సివిల్ సప్లై అధికారుల దృష్టికి తీసుకువెళ్తే పై అధికారులకు లేఖలు రాశాము. మా చేతిలో ఏమీ లేదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యోదయ కార్డుదారులకు చక్కెర ఇప్పించాలని కోరినట్లు తెలిపారు.

.