తెలుగు భాషకు వన్నెతెచ్చిన సినారె.

జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో  సినారె జయంతి వేడుకలు. 

తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల): డాక్టర్ సినారె తెలుగు భాషకు వన్నెతెచ్చారని రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం గౌరవ సలహాదారు జూకంటి జగన్నాథం అన్నారు. సోమవారం గాంధీ చౌరస్తాలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి వన్నె తీసుకొచ్చిన సినారె సాహిత్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలగుండ రవి, డాక్టర్ వాసరవేనివేని పరుశరాములు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, డాక్టర్ జనపాల శంకరయ్య, వెంగళ లక్ష్మణ్, బూర దేవానందం,  లక్ష్మణ్, అంకారపు రవి, కిరణ్ కుమార్, గుండెల్లి వంశీ,  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

.