"ఉపాధి కోల్పోయిన కార్మికులకు కంపెనీ యజమాన్యం నుంచి పరిహారం ఇప్పించిన"

బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్...

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దుండిగల్ మున్సిపల్ పరిధిలోనీ ఇండస్ట్రీ ఏరియా "మాస్క్ ఎంటర్ ప్రైజెస్"కంపెనీలో నవీన్ కుమార్ రెడ్డి, రవి అనే కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా పని చేయడం జరుగుతుంది. కంపెనీ యజమాన్యం కార్మికులకు ఇద్దరికీ చెప్పకుండా డ్యూటీలో నుంచి తీసివేయడం జరిగింది. కార్మికులకు  రావలసిన వేతనం ఇవ్వకుండా, ఏదో రకంగా నిర్లక్ష్యం చేస్తూ కార్మికులకు  వేత్తనం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ పంపించేవారు. కార్మికులకు ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి కార్మికుల ద్వారా తెలుసుకొని  బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ అతని గురించి తెలుసుకొని రవిసింగ్ ఆఫీస్ వద్దకు వెళ్లి కార్మికులకి జరిగిన అన్యాయం చెప్పుకున్నారు, ఆ తర్వాత వెంటనే స్పందించిన రవిసింగ్ హుటాహుటిన మాస్క్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ దగ్గరికి వెళ్లి యజమాన్యంతో కార్మికులకు రావలసిన వేతనం గురించి పలుమార్లు చర్చించి కార్మికుల ఇద్దరికీ రావాల్సిన వేతనం నవీన్ కుమార్ రెడ్డికి 1,14,000 వేలు, రవికి 48000 వేల రూపాయలు ఇప్పించడం జరిగింది.కార్మికులు నవీన్ కుమార్ రెడ్డి,రవి మాట్లాడుతూ మాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి మా తరపున, మా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

.