సినారె అందించిన సేవలు మరువలేనివి.

బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్. 

తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల): సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి అందించే సేవలు మరువలేనివని  బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో డాక్టర్ సినారె జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గూడూరు ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యానికి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సాహిత్యంలో అందించిన సేవలు మరువలేను అని అన్నారు. ఆయన అందించిన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో  జిందo చక్రపాణి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

.