ఎస్పీ అఖిల్ మహాజన్.
ఫోన్ల రికవరీలో రాష్ట్రంలో మొదటి స్థానం.
తెలంగాణ ప్రభ (
సిరిసిల్ల): సెల్ ఫోన్ పోతే పోయిన వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి పడిపోయిన దొంగిలించబడిన 78 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. సెల్ఫోన్ పోయిన పక్షంలో టెన్షన్ పడకుండా వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లోలాగిన్ అయి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఈరోజు వరకు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా 1200 ఫోన్ లను గుర్తించడం జరిగిందని1019 ఫోన్లను సంబంధిత బాధితులకు అందించినట్లు తెలిపారు. విటీ విలువ సుమారు కోటి రూపాయల పైగా ఉంటుందని అన్నారు. రికవరీలో 84 శాతం లో జిల్లా మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఫోన్ దొరికిన బాధితులలో, గ్రామాలలో స్నేహితులతో ఎవరైనా ఫోన్ దొంగతనం జరిగితే తక్షణమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా దొంగతనానికి గురైన ఫోన్లను పట్టుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందని ముందుగా పోలీస్ స్టేషన్లో తర్వాత మీ సేవ కేంద్రంలో www.ceir.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి వివరాలు నమోదు చేయాలని తెలిపారు.
