నేడు రెండో విడుత రుణమాఫీ

మాఫీ కానున్న రూ.1.50 లక్షలు

రైతులు, ప్రజా ప్రతినిధులు తరలిరావాలి

జిల్లా కలెక్టర్  సందీప్ కుమార్ ఝా

తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ రెండవ విడుత నిధులను రాష్ట్ర ప్రభుత్వం 

ఈ నెల 30వ తేదీన ( మంగళవారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయనుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధుల, రైతుల, అధికారుల సమక్షంలో రెండో విడుత రుణమాఫీ రూ. 1.50 లక్షల కార్యక్రమం నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

ఈ రుణమాఫీ కార్యక్రమంలో జిల్లాలోని రైతులు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు వ్యవసాయ శాఖ సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రుణమాఫీ లబ్ధిదారులైన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.

.