ఎనిమిదవ రోజుకు చేరిన దీక్షలు.
ఏఐటీయూసీ మద్దతు.
నేడు కలెక్టరేట్ ముట్టడి.
తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): వస్త్ర పరిశ్రమ సమస్యల పట్ల స్థానిక శాసనసభ్యులు స్పందించకపోవడంపై జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కల్పించాలని విద్యుత్ సబ్సిడీ అందించాలని కోరుతూ వస్త్ర పరిశ్రమ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు సోమవారం 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమస్యల పట్ల స్థానిక శాసనసభ్యులకు పట్టింపు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది రోజులుగా దీక్షలు జరుగుతున్న కనీసం ఒక్కసారి కూడా స్పందించకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వానికి సమస్యలను ఎన్నిసార్లు మొరపెట్టిన పట్టించుకోవడంలేదని అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. దీక్షలకు ఏఐటీయూసీ నాయకులు కడారి రాములు తోపాటు పలువురు మద్దతు తెలిపారు సమస్యను పరిష్కరించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు వస్త్ర పరిశ్రమ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
