తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బోనాల పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ పండుగకు బాన్స్ వాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అతిదులుగా పాల్గొని.. గ్రామ మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆషాడ మాసంలో బోనాల పండుగని రాష్ట్ర తెలంగాణ ఆడపడుచులు నూతన వస్త్రాలను దరిస్తూ డీజే ఆటపాటలతో సంబరాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆలయాలలోని ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుళ్లకు బోనాలను సమర్పించి ధూపాదీప నైవేద్యంతో మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఎల్లవేళలా సంతోషంగా ఉండాలన్నారు. రైతులు పాడి పంటలను పండించి సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని గ్రామ దేవతలను దీవించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉమ్మడి మండలాల మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
