సిసీ రోడ్డును ప్రారంభించిన బీఆర్ఎస్ కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ..

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దుందిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపేట్ 26వ వార్డు కేవిఆర్ వ్యాలిలో రూ.50 లక్షల వ్యయంతో  నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ అనంతరం కేక్ కట్ చేసి వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా పూర్తి చేయాలని నాణ్యతలో రాజీ పడొద్దు అని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కి సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కాలనీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

.