రాష్ట్ర పథకాలను అర్హులకు అందజేసి ప్రతి కార్యకర్త కృషి చేయాలి- సిపిఐ.

తెలంగాణ ప్రభ (కోటగిరి): సిపిఐ మండల కౌన్సిల్ సమావేశాని ఆదివారం కోటగిరి మండల కేంద్రంలో హట్టాసంగా  సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా పాత్రికేయులతో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సిపిఐ భాగస్వామ్యం ఉన్నందున ప్రజలకు ఇచ్చే పథకాలను అర్హులకు అందేటట్లు చూడాల్సిన బాధ్యత సిపిఐ కార్యకర్తపై ఉన్నదని అన్నారు. 

 సిపిఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబాస్.రాములు మాట్లాడుతూ.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రాజకీయ శిక్షణ తరగతులు 2 రోజులపాటు నిజామాబాద్ నగరంలో జరుగుతాయని ఈ శిక్షణ తరగతులకు మొదటి రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కామ్రేడ్. కునంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు కామ్రేడ్.పశ్య పద్మ, ఇతర నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై  ఇతర  అంశాలపై శిక్షణ తరగతులు ఉంటాయని   ఈ శిక్షణ తరగతుల విజయవంతంకై రెండు జిల్లాల సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు  ప్రజాసంఘాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నామన్నారు ఈ  సమావేశంలో సిపిఐ  మండల కార్యదర్శి ఏ.విట్టల్ గౌడ్, నల్ల.గంగాధర్, బర్ల సునీల్ కుమార్, దత్తు,మాస్కల గంగారం, కప్ప.సాయిలు,శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.

.