మహిళల ఆర్థిక సామజిక అభివృద్ధి లక్ష్యముగా మహిళా శక్తి పథకము

మున్సిపల్ కమిషనర్ బి తిరుపతి

మెప్మా అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ 

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మున్సిపల్ సమావేశ మందిరం యందు మెప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు మహిళా సంఘ సభ్యులతో మహిళా శక్తి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినది.

ఈ సందర్భముగా వక్తలు  మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత అందిస్తామని అన్నారు. మహిళా క్యాంటీన్‌లతో పాటు స్త్రీనిధి లింకేజ్‌, బ్యాంకు లింకేజ్‌ ల ద్వారా నిధులు సమకూర్చి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. 

రాబోయే సం,,లో 2.89 కోట్ల రుణ సదుపాయము కోరుట్ల మున్సిపాలిటీకి  కల్పించాలని, ఇట్టివి వ్యాపారాభివృద్ధి కోసం వినియోగించుకోవాలని, మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయాలని, సంఘాలలో లేని మహిళలను సంఘాలలో చేర్పించాలని, వడ్డీ లేని రుణాలపై అవగాహన కల్పించాలని, ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి 2 లక్షల భీమా సౌకర్యం (స్త్రీనిధి), ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి ప్రమాదవశాత్తు భీమా 10 లక్షలు, వ్యాపారమునకు సంబంధించి నైపుణ్యాలను, మార్కెటింగ్, బ్రాండింగ్ డెవలప్ చేయుట, అమ్మ ఆదర్శ స్కూల్ లలో వి.ఓ ప్రెసిడెంట్ ద్వారా స్కూల్ బిల్డింగ్ రిపేర్లు చేయించడం, మౌళిక సదుపాయాలకు సంబంధించిన పనులు చేయించడం, స్కూల్ యూనిఫామ్స్ మరియు అంగన్వాడి పిల్లల యూనిఫామ్స్ ,ఇతర ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల యూనిఫామ్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల యూనిఫామ్స్ ను స్వయం సహాయక సంఘ మహిళల ద్వారా కుట్టించడం, డ్వాక్రా బజార్లు ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, మీసేవా సెంటర్లు (బ్యాంకింగ్ జనరల్ లావాదేవీలు,SHG ల ఆర్ధిక లావాదేవీలు), జిల్లా కు ఒక క్యాంటీన్ (ప్రభుత్వ ఆసుపత్రి ) మహిళలచే నిర్వహించేలా చేయడం, పుడ్ సెక్టార్/ నాన్ ఫాం సెక్టార్ లో మహిళలను మహిళా శక్తి పరిధిలోకి తీసుకు రావాలని, సర్వీస్ సెక్టార్ లలో బ్యాంకు మిత్ర, పశుమిత్ర, కృషి మిత్ర లను గుర్తించి, శిక్షణ ఇచ్చి సంబంధిత రంగాలను నిర్వహించేలా చేయడం వంటివి చేపట్టాలని తెలిపారు.

ఇట్టి కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ బి తిరుపతి, మెప్మా ఎ.ఓ శ్రీనివాస్ గౌడ్, డి.యం.సి సునీత, టి.యం.సి శ్రీరామ గౌడ్,Co మెప్మా  ,రిసోర్స్ పర్సన్స్ , ALF & TLF అధ్యక్షులు  పాల్గొన్నారు.

.