అక్రమంగా ఇసుక తరలించిన వ్యక్తి అరెస్టు రిమాండ్ కు తరలింపు

అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

ఎస్సై డి.సుధాకర్

తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలంలోని అంకుషాపూర్ గ్రామ శివారులో  గల ఓర్రె నుండి వివిధ గ్రామాలకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు అని సమాచారం రావడంతో తంగళ్ళపల్లి ఎస్సై డి.సుధాకర్ సిబ్బంది కిష్టయ్య, శ్రీనివాస్, సంపత్ తో కలిసి వెళ్లి  అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న  ట్రాక్టర్ నం.TS23T6057-ట్రైలర్ నం.6056 గల ఇసుక ట్రాక్టర్ మీద కేసు నమోదు చేసి సీజ్ చేయడం జరిగింది అని ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా  ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ మరియు ఓనర్ అయిన అంకుషాపూర్ గ్రామానికి చెందిన గౌరవేణి.రాజు  పై కేసు నమోదు చేసి వాహనాన్ని  సీజ్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఎస్సై సుధాకర్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా సమాచారం సేకరించిన కానిస్టేబుల్ లను ఎస్సై అభినందించారు. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

.