కోరుట్ల శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో ఆషాడ బోనాలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో అంగరంగ వైభవంగా ఆషాడ మాసం బోనాలు ఘనంగా నిర్వహించారు. 

మహిళలు భక్తి శ్రద్ధలతో డప్పు చప్పులతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

పండగ ఏదైనా దాని విశిష్టతను, ధర్మం, సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను కళ్ళకు కొట్టోచ్ఛినట్లు నేటి ఆషాడ మాసం కార్యక్రమంలో మనం నిర్వహించుకుని ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మహిళలు తమ పిల్లలు పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని కోరుకుంటూ,అందర్నీ చల్లంగా చూడాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు

.