డి టి ఓ కు ఏబీవీపీ ఫిర్యాదు.
తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు చెలగాటమాడుతున్నారని ఏబీవీపీ నాయకులు రంజిత్ అన్నారు. శుక్రవారం జిల్లా రవాణా అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం ఏబీవీపీ నాయకులు రంజిత్ మాట్లాడతూ ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్న పాఠశాలల కళాశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా రవాణా అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గురువారం ఎల్లారెడ్డిపేట్ మండలంలోని శ్రీ చైతన్య పాఠశాల బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన వ్యవహారాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు నిర్వాహకులపై అధికారులు దృష్టి పెట్టి ఫిట్నెస్ లేని బస్సులు ఉపయోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రశాంత్, రాజు రావు పాల్గొన్నారు.
