తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): జిల్లా వైద్య అధికారిగా ముదలి వసంతరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. వసంతరావు వరంగల్ వైద్య కళాశాలలో 1986లో ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్నారు. 98 లో గవర్నమెంట్ సర్వీసెస్ జాయిన్ అయ్యారు. వివిధ హోదాల్లో పని చేసిన ఆయన రెండు సంవత్సరాలు పెద్దపల్లిలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల ఇంచార్జ్ జిల్లా వైద్య అధికారిగా నియామకం అయ్యారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
