
తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి పట్టణంలోని మహాత్మా జ్యోతి పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల పురుషుల గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల లో తక్షణ ప్రవేశాలకు దరఖాస్తు లు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఏలగొండ రాధకిషన్ ఒక ప్రకటన లో తెలిపారు.బిఏ,(ఈపిహెచ్),బికామ్,(సిఏ)బిఎస్సీ ఎంపీసీఎస్, బిఎస్సి బిజెడ్సీ ఇంగ్లీష్ మిడియం కోర్సులకు తక్షణ దరఖాస్తు లు చేసుకోవాలని అర్హులైన విద్యార్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాల తో ఈ నెల 31 తేదీ వరకు కళాశాల లో చేరవచ్చునని నాణ్యమైన విద్య తో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు,దుస్తులు, భోజనం అందజేస్తామని ఇతర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. మరింత సమాచారం కోసం 8121149717,8179407798 ,767490560 ఫోన్ నంబర్ లను సంప్రదించలని ప్రిన్సిపాల్ కోరారు
