లింగాపూర్ లో వన మహోత్సవం కార్యక్రమం

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం ఆధ్వర్యంలో లింగాపూర్ గ్రామంలో  చెరువు కట్టపై వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా  తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ. విట్టల్ గౌడ్ మాట్లాడుతూ.... లింగాపూర్ గ్రామంలో చెరువు కట్ట పైన ఈత ఖజురా చెట్ల మొక్కలను నాటడం జరిగిందన్నారు. టిఎఫ్టి గీతా కార్మికులు చెరుకట్టల పైన ఈత తాటి ఖర్జూర చెట్లను  సుమారు 500 మొక్కలను నాట్టడం జరిగిందని తెలిపారు.  గీత కార్మికులు చెరువు కట్టల మీద  ప్రభుత్వ స్థలాలలో   ఈత మొక్కలు నాటుకొని చెట్లను పెంచుకోవడం వలన రాబోయే రోజులలో గీత కార్మికుల  వృత్తి మరింత అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుందన్నారు. సహకార సంఘాలు టిఎఫ్టి కార్మికులు వన పెంపకం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు.  తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం  జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమలను  నిర్వహిస్తున్నామని అందులోనే భాగంగా నేడు కార్యక్రమం చేపట్టడం  జరిగిందన్నారు. ఈ చెట్ల ద్వారా రాబోయే రోజులలో ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళుని ఇవ్వటానికి తోడ్పడుతుందని అన్నారు. ప్రభుత్వం  వన పెంపకానికి గ్రామాలలో ఐదు ఎకరాల భూమిని సహకార సంఘాలకు 10 ఎకరాలు  భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో లింగాపూర్ టి ఎఫ్ టి కార్మికులు రాజా గౌడ్ గంగాధర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర గీతా పనివారి సంఘం మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బి. వెంక గౌడ్ శ్రీధర్ గౌడ్ బి. పండరి గౌడ్ బి. శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

.