హైందవ ఆచారాలను పాటిస్తూ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాల సందడి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల అంటేనే చక్కటి క్రమశిక్షణ, దేశభక్తి మన  సాంస్కృతి సాంప్రదాయాలు పండగలు కలలు విశిష్టతతో పాటు ఒక ఉన్నతమైన బాధ్యత గల పౌరులను తయారు చేసే ఒక దేవాలయం ఒక గ్రంథాలయం ఒక వేద పాఠశాల, దేహదారుడ్యాన్ని పెంచే ఒక వ్యాయామశాల వలే అధ్యాపకులు నిత్యం శక్తి వంచన లేకుండా విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంటారు. పండగ ఏదైనా దాన్ని విశిష్టతను ముందుగానే తెలియజేసి విద్యార్థులకు దేశం, ధర్మం సంస్కృతి సాంప్రదాయాల  విశిష్టతను కళ్ళకు కొట్టొచ్చినట్లు పిల్లలచే వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటి ప్రత్యేకతను తెలియజేస్తుంటారు. 

నేటి ఆషాడ మాసం కార్యక్రమంలో మనం నిర్వహించుకుని ఆషాడ మాసంలో అమ్మవారికి నిర్వహించే బోనాల పండుగ కార్యక్రమం ఏర్పాటు చేసి ముందుగా సరస్వతీ శిశు మందిర్ పాఠశాల కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్,  ప్రబంధకారిని కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్  పాఠశాల ప్రధానాచార్యులు గోపు వెంకటేష్  పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు ఎత్తుకొని శిశు మందిర్ నుంచి బయలుదేరారు.

విద్యార్థులు పోతరాజుల వేషధారణలో విద్యార్థినిలు అమ్మవారి వేషధారణలో ఊరేగింపుగా కోరుట్ల పట్టణ పురవీధుల గుండా ప్రముఖ కూడళ్ళలో నృత్యాలను అద్భుతంగా ప్రదర్శనలు చేశారని పేర్కొన్నారు.

 అమ్మవారికి సంబంధించిన వేషధారణలో కోలాటం, యోగుచాప్ సంబంధించిన ప్రదర్శనలు ప్రదర్శించడం జరిగింది.

పాఠశాల కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్  మాట్లాడుతూ గత సంవత్సరం కోరుట్ల పట్టణంలో  మొట్టమొదటిగా మా సరస్వతీ శిశు మందిర్ విద్యార్థిని విద్యార్థులచే ప్రథమంగా తెలంగాణ సాంప్రదాయ బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంతకు రెట్టింపు ఉత్సాహంతో హైస్కూల్ విద్యార్థులచే ఇంకా ఘనంగా ఈ సంవత్సరం నిర్వహించుకోవడం నిజంగా గొప్ప విషయమని తెలియజేశారు. 

వర్షంలో సైతం ఎక్కడ కూడా వర్షాన్ని లెక్కచేయకుండా విద్యార్థినీ విద్యార్థులు నూతన ఉత్సాహంతో అత్యుత్సాహంతో వారు ప్రదర్శనలు చేయడం జరిగింది  

సుమారు రెండు కిలోమీటర్ల మేర నడకదారిలో నృత్య ప్రదర్శన చేస్తూ వాగు దగ్గరలోని పోచమ్మ అమ్మవారికి శిశు మందిర్ పక్షాన బోనాలు సమర్పించి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సిరిసంపదలతో విరజిల్లాలని విద్యార్థిని విద్యార్థులకు మంచి బుద్ధులు ఇస్తూ విద్యావంతులు కావాలని కోరుకోవడం జరిగింది. 

మన తెలంగాణ ఉనికిని చాటే మన సాంప్రదాయం ఆషాడ మాస బోనాలలో భాగంగా మన కోరుట్ల పట్టణ అమ్మవారి పోచమ్మ తల్లికి బోనాలను విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించడం వలన భవిష్యత్తులో మన ఆచారము సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థి దశ నుంచే నేర్చుకోవడం, హిందూ దేవి దేవతల గొప్పతనాన్ని తెలుసుకోవడానికి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలియజేశారు.  

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు గోపూ వెంకటేష్, ప్రబంధకారిణి కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్, కార్యవర్గ సభ్యులు అందే శివప్రసాద్, కొండబత్తిని అమర్నాథ్, సమితి కార్యదర్శి చెట్పల్లీ శంకర్  అధ్యాపక బృందం మరియు ప్రబంధకారిణి, సమితి సభ్యులు  పాల్గొన్నారు.

 ఇంత ఘనంగా బోనాలు నిర్వహించడం పట్ల పట్టణంలోని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు.

వర్షంలో సైతం విద్యార్థిని విద్యార్థుల నృత్యాలను ప్రజలకు చేరవేసే మీడియా మిత్రులైన కటుకం గణేష్, పండిత్ శంకర్,కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియగేశారు.

.