కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోరుట్ల నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని  కోరుట్ల నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్.రఘు  అన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని ఆయన తెలిపారు. 

లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి అత్యవసరం ఉన్నా వెంటనే అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు. 

అలాగే పొలాలకు వెళ్లే వారు తడిసిన విద్యుత్ స్తంభాలను తాకవద్దని, చెట్ల కింద ఉండొద్దని సూచించారు.

.