తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో ఇంటింటా జ్వర సర్వే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోరుట్ల పట్టణం మూడవ వార్డులో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించనైనది.
ఇట్టి కార్యక్రమం సందర్భంగా మూడవ వార్డు కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో విస్తరంగా వర్షాలు పడుతున్నందున సిజినల్ వ్యాధులు, జ్వరాలు, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా ఇంట్లో ఉన్న పూల మొక్కలలో గాని టైర్లలో గాని డ్రమ్ములలో గాని మరియు ఇతర చోట్ల నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను శుభ్రపరుచుకోవాలి, లేనియెడల అట్టి నిల్వ ఉన్న నీటిలో దోమలు తయారై మనుషులకు కుట్టినచో ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో శుభ్రపరచుకోవాలని ఆయన తెలిపారు తెలి
అదేవిధంగా జ్వరాలు వచ్చిన వ్యక్తులు వెంటనే దగ్గరలో ఉన్న హాజీపూర్ డైమండ్ రెస్టారెంట్ ప్రక్క సంధిలోగల బస్తీ దావఖాన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకోవాలని ఆయన తెలిపినారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు తాటిపాముల మమత సామల్ల మమత వార్డు ప్రజలు పాల్గొన్నారు.
.