తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వన మహోత్సవం సందర్భంగా కోరుట్ల పట్టణంలో మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మన ప్రెస్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమంటపం ముందర మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి హాజరయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ మొక్కలు నాటడమే ముఖ్యం కాదని వాటిని సంరక్షించినప్పుడే ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు పట్టణంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి కోరుట్ల పట్టణాన్ని హరిత హారంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు.
వచ్చిన అతిధులకు మన ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఉరుమడ్ల శ్రీనివాస్, అల్లే రాము, మన ప్రెస్ క్లబ్ కార్యవర్గం కృతజ్ఞతలు తెలియజేసింది.
.