తెలంగాణ ప్రభ,(కోనరావుపేట); రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కోనరావుపేట మండలం మర్రిమడ్లలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలభిషేకం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీ తోనే ప్రజాపాలన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్ము బాబు,జింక శ్రీనివాస్,కడకుంట్ల శంకర్,దువ్వ గణేష్,తీగల రామచంద్రం,సింగం నారాయణ,మల్లేశం,కోలశ్రీనివాస్ ,రైతులు తదితరులు పాల్గొన్నారు.
