తెలంగాణ ప్రభ (కోరుట్ల): వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణ,సంరక్షణ, భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని జిల్లా సంక్షేమాధికారి బి.నరేశ్ అన్నారు.
మంగళవారం జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన సీనియర్ సిటీజేన్ల పత్రికలను,చట్టం పై అవగాహన పుస్తకాలను జిల్లా సంక్షేమ అధికారి బి.నరేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి.డబ్ల్యుఓ.నరేశ్ మాట్లాడుతూ తల్లిదండ్రులైన వయో వృద్ధులను పోషించక నిరాదరిస్తున్న, వేధింపులకు గురి చేసిన వారికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 సెక్షన్ 24 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్ష ,జరిమాన విధించే వీలుందన్నారు. జిల్లాలో వయోధికుల రక్షణ,నిరాదరణ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీనియర్ సిటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను, ప్రదాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,జిల్లా కమిటీ ప్రతినిధులను అభినందించారు.
సీనియర్ సిటిజెన్ల రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్,మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్,కోరుట్ల ఆర్డీవో ఆనంద్ కుమార్ లు వయోవృద్ధుల కేసుల పరిష్కారంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా జగిత్యాల జిల్లాను నిలిపారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వయోవృద్ధుల చట్టం పకడ్బందీగా అమలుకు జిల్లా కలెక్టర్లకు,పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కార్యాలయం సూపరింటెండెంట్ చంద్ర మోహన్,ఫీల్డ్ అధికారి కొండయ్య,జిల్లా, డివిజన్, మండలాల ,గ్రామాల సీనియర్ సిటిజెన్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
.