పట్టణంలోని 13వార్డుల్లో ఎంఐఎంను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలి
ఎంఐఎం పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జి సమద్ బిన్ అబ్దాద్ పిలుప
తెలంగాణ ప్రభ (కోరుట్ల): రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కోరుట్ల మున్సిపల్ పై ఎంఐఎం పార్టీ జెండా రెపరెపలాడించాలనీ, అందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఎంఐఎం పార్టీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇంచార్జ్ సమద్ బిన్ అబ్దాత్ పిలుపునిచ్చారు. ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో సమద్ బిన్ అబ్దాత్ పర్యటించారు.
కోరుట్ల పట్టణంలోని గజమ్స్ బ్యాంకేట్ హల్ లో ఇంఛార్జి సమద్ బిన్ అబ్దత్ ముందుగా కమిటీ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులతో సమావేశం అయ్యారు. అందరి అభిప్రాయ సేకరణ అనంతరం సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేశారు.
సభ్యత్వ నమోదు కోసం తాత్కాలిక అడ్ హక్ కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం సమద్ బిన్ అబ్దాత్ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కోరుట్లలో ఎంఐఎం పార్టీ జెండా ఎగురవేయాలి అంటే ప్రతి కార్యకర్త ప్రజా సమస్యలను తెలుసుకొని నిత్యం ప్రజల్లో ఉంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 20స్థానాల్లో పోటీ చేసేందుకు తమ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కసరత్తు చేస్తున్నారని ఆయన చెప్పారు.
పార్టీని జగిత్యాల జిల్లాలో సంస్థగతంగా, నిర్మాణపరంగా బలోపేతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పదునైన మెట్టుగా శ్రమించాలని విజ్ఞప్తి చేశారు.
వివాదాల కతీతంగా, క్రమశిక్షణతో, బాధ్యతయుతంగా పార్టీ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాలపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కోరుట్లకు మొట్ట మొదటిసారిగా విచ్చేసిన సమద్ బిన్ అబ్దాద్ కు, ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ కు కోరుట్ల పట్టణ కమిటీ నాయకులు పూలమాలలు వేసి, శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, కౌన్సిలర్ అబ్దుల్ రఫీ, నాయకులు రౌఫ్ రహమాన్, చాన్ భాయి, రహీం, మజ్ హర్, వాజిద్, ముశ్తాఖ్, ముజాహిద్, కలీమ్, హఫీజ్, మొహసీన్, షాబద్ధీన్, మున్నా, సురేష్, ఖాళీళ్, రైస్ తదితరులు పాల్గొన్నారు.
.