అమన్ యూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో.....
తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలంలోని జల్లా పల్లి అభాది ప్రభుత్వ పాఠశాలలో మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా ఉమా యూత్ అధ్యక్షుడు ఆరిఫ్ చేతుల మీదుగా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అరిఫ్ మాట్లాడుతూ.. అమాన్ యూత్ సంఘ సభ్యుల తరఫున గ్రామ ప్రజల తరఫున డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన దీవించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, రసూల్ ఖాన్ ఇబ్రహీం అప్రోచ్ గౌస్ రఫీక్ ఈద్రిస్ జునేత్ సోహెల్ సభ్యులు విద్యార్థినిలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
