తెలంగాణ ప్రభ (కోరుట్ల): గత కొంత కాలం నుండి కోరుట్ల పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో హత్య కేసులలో, సుఫారి హత్య కేసులు మరియు బలవంతపు వసూళ్లు కేసులలో నిందితులైన విత్తనాల నాగరాజు, గుడ్ల విశాల్ కోరుట్లకు చెందిన ఇద్దరు వ్యక్తులపై జగిత్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పిడి యాక్ట్ నమోదు చేయగా, ఈ రోజు ఇద్దరిపై అధికారికంగా పిడి యాక్ట్ ప్రభుత్వంచే ధ్రువీకరించబడినది. ప్రస్తుతం వీరిద్దరూ చర్లపల్లి జైలు హైదరాబాద్ నందు ఉన్నారు.
భారతీయ ఆయుధ చట్ట ప్రకారం మూడు కేసులను ప్రాథమికంగా తీసుకొని పిడి యాక్ట్ నమోదు చేయటం జరిగినది. పిడి యాక్ట్ నమోదుకు కృషి చేసిన కోరుట్ల సీఐ సురేష్ మరియు ఎస్‌ఐ కిరణ్‌కుమార్ లను మెట్‌పల్లి డీఎస్పీ ఉమమహేశ్వర రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇలాంటి చట్ట వ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
.