తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి ఉమ్మడి మండల కేంద్రలాలో ప్రజా ప్రతినిధులు,నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్ పాల్గొని కేకును కట్ చేశారు. విద్యార్థినీ విద్యార్థులకు స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చాగం కృష్ణారెడ్డి మాట్లాడుతూ... నేడు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మాజీ డిసిసిబి చైర్మన్ కు కొత్తపల్లి గ్రామస్తుల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం శంకర్ పటేల్ చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు అరటిపళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు కేకును పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పల దత్తాత్రి ఏంఎంసి చైర్మన్ అబ్దుల్ హమీద్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాజీ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పుప్పల సైదయ్య లక్ష్మణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
