ఘనంగా కాంగ్రెస్ అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే పుట్టినరోజు వేడుకలు కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ కేక్ కత్తిరించి కార్యక్రమాలను ప్రారంభించారు. 

కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగ రావు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గంగాధర్ పేర్కొన్నారు 

ఈ కార్యక్రమంలో గంగాధర్ తో పాటు పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి మ్యాకల నర్సయ్య, తెడ్డు విజయ్, తోడేటి శ్రావణ్ కుమార్, దండిక రాజం, తోడేటి శంకర్, ఎం డి కలీం  తదితరులు పాల్గొన్నారు.

.