సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను ఆలయ కమిటీ  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి వేడుకల్లో ముఖ్య అతిథులుగా కోటగిరి ఉమ్మడి మండలాల ఎంపీడీవో కేఆర్ మనోహర్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ...ప్రజలందరి పై సాయిబాబా ఆశీస్సులు,దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కేఆర్ మనోహర్ రెడ్డి దంపతులు రమేష్ సేట్, శంకర్,  గంగా మహీందర్,ప్రమోద్ ,భక్తులు తదితరులుపాల్గొన్నారు.

.