ముదిరాజ్ లను బీసీ-ఏలో చేర్చాలి : ఎమ్మెల్యే వినతిపత్రం ఇచ్చిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ...
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు చినంగి వెంకటేశం ముదిరాజ్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ను మర్యాదపూర్వకంగా కలిసి ముదిరాజ్ ల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేకు వారి డిమాండ్లను వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా డిమాండ్లను పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు.
1) జీవో ఎం.ఎస్. నెంబర్ 15/2009 ప్రకారం ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి బీసీ- ఏ లోకి మార్చాలన్నారు.
2) ముదిరాజ్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలను కేటాయించి 75 శాతం సబ్సిడీతో సంక్షేమ పథకాలు అందించాలన్నారు.
3) చెరువులు, కుంటాలపై, మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న ముదిరాజ్ /బెస్త / గంగపుత్ర / గూండ్ల కులస్తులకు మాత్రమే చెరువులు కుంటలపై హక్కులు కల్పించాలన్నారు.
4) మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న ముదిరాజ్ కులస్తులను అసంఘటిత కార్మికులుగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు.
5) ముదిరాజుల కేటాయించిన అసైన్డ్ భూములను పునరుద్ధరించి పాస్ పుస్తకాలను అందజేయాలన్నారు.
6) బీసీ క్రిమిలేయర్ నుంచి ముదిరాజులను తొలగించే విధంగా కేంద్రానికి సిఫారసు చేయాలన్నారు.
7) 50 సంవత్సరాల నిండిన ముదిరాజులకు ఆసరా పెన్షన్ అందజేయాలన్నారు.
8) 6 వేలకు పై చీలుకు ఉన్న అన్ని సొసైటీలకు 100% ఉచితంగా చేపల పంపిణీ చేయాలి.
9) తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా ముదిరాజును నియమించాలి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించిన వారిలో నిజాంపేట్ కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్, బాచుపల్లి మాజీ ఎంపిటిసి సత్యనారాయణ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా ముదిరాజ్ సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం సభ్యులు చినంగి మల్లేష్ ముదిరాజ్, ఉప్పరి కృష్ణ ముదిరాజ్, పిట్ల సత్యనారాయణ ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్, గోపాల్ ముదిరాజ్, హరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
.