తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) గురు పౌర్ణమి సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరిపై స్వామి ఆశీస్సులు ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలను రాజశేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
