డాక్టరేట్ పట్టా పొందిన రమేష్ కు ఘన సన్మానం

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని  యశశ్రీ హైస్కూల్ లో  గాంధారికర్  రమేష్  డాక్టరేట్ పట్టా పొంది మొట్ట మొదటిసారిగా ఆయన స్వగ్రామమైన కోటగిరికి రావడంతో  చిన్ననాటి బాల్య మిత్రులందరూ కలసి పూలమాల వేసి శాలువతో  ఘనంగా సన్మానించారు. ఆయన విద్యాభ్యాసం చేసిన  పాఠశాలలు కోటగిరి అరవింద విద్యానికేతన్ , ప్రభుత్వ జిల్లా పరిషత్  పాఠశాల, బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల,   ప్రభుత్వ గిరిరాజ్  కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేయడం జరిగిందన్నారు .

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని  డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ (సామాజిక సేవ శాస్త్ర విభాగం) నుంచి పరిశోధన చేసి పి.హెచ్.డి.ని  పూర్తి చేయడంతో గాంధారికర్ రమేష్ s/o రాజన్న *అంశం:-ఉత్తర తెలంగాణలోని సమగర (మోచి) కమ్యూనిటీలో మారుతున్న జీవన ఉపాధి పరిస్థితులపై అధ్యయనం చేసి డిసెంబర్ 2017  ప్రారంభమైనటువంటి పరిశోధన 2024 జులైలో యూనివర్సిటీకి  పరిశోధక గ్రంథ సమర్పణతో పి.హెచ్.డి. పూర్తి చేసుకుని డాక్టరేట్ పట్టాను యూనివర్సిటీ డిపార్ట్మెంట్  అధికారుల చేత    పొందడం జరిగింది. ఈ  కార్యక్రమం సందర్భంగా కోటగిరి పూర్వ విద్యార్థులు, మిత్రులు  రమేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సన్మాన సభలో పాల్గొన్నవారు విట్టల్ గౌడ్ ఓమయ్య దుబాస్ రాములు సుధాకర్ తాటికొండ రాము విజయ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

.