రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధి రంగారెడ్డి రెడ్డి నగర్ లో వినోద్ జాదవ్ నూతనంగా ఏర్పాటు చేసిన యూరొ కిడ్స్ ది ప్రి స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి స్కూల్ ని ప్రారంభించిన మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందచ్చని అందరూ చదువుకొని అభివృద్ధిలో ఉండాలన్న ప్రతి ఒక్కరికి జ్ఞానం విద్య ద్వారానే వస్తుందన్నారు .ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ ,నందనం దివాకర్, గిరివర్ధన్ రెడ్డి,జె.కె శేఖర్ యాదవ్,మాణిక్ రెడ్డి, గరిగే శేఖర్,డివిజన్ అధ్యక్షులు పరుశ వేణు, సతీష్, శ్రీనివాస్ గౌడ్, నార్లకంటి దుర్గయ్య,సాయిలు, నాగదీప్ గౌడ్, మహేష్,వర్మ,ఈశ్వర్, శ్రవణ్,శివ, శ్యామ్,హర్ష తదితరులు పాల్గొన్నారు.
