రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి

రైతు బీమా బాండ్ పై ఇలాంటి తప్పులున్న సవరించుకోండి..

రైతులకు సూచించిన వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారులు ప్రేమ్ రాజ్, ప్రతాప్ కుమార్, 

తెలంగాణ ప్రభ, (నర్సాపూర్): రైతులందరూ రైతు భీమా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారులు ప్రేమ్ రాజ్, ప్రతాప్ కుమార్, అన్నారు, ఆదివారం వారి విలేకరులతో నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని హత్నూర మండలం కాసాల, చింతల్ చెరువు , క్లస్టర్ రైతు వేదికల్లో వద్ద వారు మాట్లాడుతూ రైతు బీమా కోసం 28 జూన్ 2024 నాటికి పట్టా పాస్ బుక్ లు అందుకున్న రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు, 18 నుండి 59 సం, లు ఉన్న ప్రతి రైతు అర్హులన్నరు, ఆగస్టు 4  తేదీ చేసుకోవాలన్నారు, గతంలో రైతు బీమా కు దరఖాస్తు చేసుకున్న రైతులు ఎలాంటి తప్పులు ఉన్న సరి చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు, రైతు బీమా దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు రైతు పట్టా పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ లు నామిని ఆధార్ కార్డు జిరాక్స్ పట్టాదారు స్వయంగా వచ్చి వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు,

.