తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని హత్నూర మండల తారకంపేట్, తుర్కల్ ఖానాపూర్ , గ్రామ పరిధిలోని సాయిబాబా మందిరంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం 5:15 నిమిషాలకు బాబా వారికి కాగడ హారతి తో ప్రారంభమైన ప్రత్యేక పూజలు ఉదయం 6 గంటలకు బాబా వారికి సుప్రభాత సేవ, ఏడు గంటలకు బాబా వారికి అభిషేకము ,ఎనిమిది గంటలకు సాయిబాబా వారి ఉచిత సామూహిక సాయి సత్య వ్రతాలు మరియు విరాట్ సాయి స్తోత్రం బాబా వారి నిత్య ప్రార్ధన పట్టణం, మధ్యాహ్నం 12 గంటలకు బాబా వారికి మధ్యాహ్న హారతి, అనంతరం బాబా వారి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం ఒకటి గంటలకు బాబా వారి పల్లకి సేవ తార్కంపేట్ , తుర్కల్ ఖానాపూర్, పురవీధుల గుండా ప్రారంభమై మరియు మందిరం వరకు ఘనంగా నిర్వహించారు. పూజ్య గురుదేవుల వద్ద దీక్ష తీసుకున్న సాయి సేవకు బి సుధాకర్, హైదరాబాద్ వారిచే బాబా వారి భజన పాటలు మరియు వివిధ ప్రాంతంలో నుండి వచ్చిన సాయి సేవకులచే పూజ గురుదేవులు అమ్ముల సాంబశివరావు గారు రచించిన శిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర నుండి 14 వ అధ్యాయం మరియు అమ్ముల సాంబశివరావు గారు రచించిన అమ్ముల పుస్తకము నుండి సత్సంగం ప్రసంగం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దూపారతి తో గురు పౌర్ణమి వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి, హత్నూర పిఎసిఎస్ అధ్యక్షులు దుర్గా రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి , రామచంద్ర రెడ్డి,శ్రీనివాసరెడ్డి, బుచ్చిరెడ్డి, మన్నె రమేష్, ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్, బాలరాజు, మల్లేశం, రామకృష్ణ గౌడ్, రఘు, విట్టలేశం వెంకటేశం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
