అవగాహన కల్పించిన గూడెల్లి మధు విద్యుత్ శాఖ ఆర్టిజన్
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) విద్యుత్ శాఖ నూతనంగా మార్పులు చేసిన టీజీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా వినియోగదారులకు మరింత దగ్గరగా చేరువయ్యే దిశగా ఆన్లైన్ పేమెంట్స్, కంప్లైంట్స్, వినియోగదారుల బిల్ వివరాలు, కరెంటు పోతే నేరుగా ఈ యాప్ ద్వారా సులభంగా కంప్లైంట్స్ చేసుకుని విధానం, విద్యుత్ సిబ్బంది, అధికారుల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి, మైసమ్మ నగర్,,-బి బ్లాక్ కమిటీ హాల్లో విద్యుత్ వినియోగదారుల మొబైల్ ఫోన్లలో టీజీ ఎస్పీడీసీఎల్ యాప్ ఇన్స్టాల్ చేసి, యాప్ యొక్క పూర్తి వివరాలను తెలపడం జరిగినది యాప్ యొక్క వినియోగం సులువుగా ఉంది అని వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది ఆర్టిజన్ గూడెల్లి మధు, బస్తి పెద్దలు, వినియోగదారులు పాల్గొన్నారు.
