ఎలమంచిలి మాటలను ఖండించిన పోతంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్  మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు సాయిలు,డిసిసి డిలిగేట్ హనుమంతు  మాట్లాడుతూ.... మాజీ ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు  ఎలమంచిలి శ్రీనివాసరావు పోతంగల్  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల  శంకర్ పార్టీ గెలుపు కొరకు పని చేయడం లేదంటూ  అసత్య  ప్రచారాలు చేస్తూ ఆరోపణ చేయడం పై పోతంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తూ ఆరోపణలను ఖండించారు. పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో  పార్టీ బలోపేతానికి పని చేయడంతో 13 వందల మెజార్టీని ఎంపీ సురేష్ షేట్కార్ కు  ఇవ్వడం జరిగిందని ఈ సమావేశం సందర్భంగా గుర్తు చేశారు . బీబీ పటేల్ కు  పోతంగల్లో బంధుత్వాలు ఉండటం వలన పార్టీ అధిష్టానానికి, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి లిడు రాకపోవచ్చు అని చెప్పడం జరిగిందన్నారు.  ప్రభుత్వంపై  బాన్సువాడ నియోజకవర్గ  నాయకులు పై బురదజల్లే మాటలు మాట్లాడడంతో ఆయనకు హెచ్చరించారు.పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటూ కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కేశవ వీరేశం గంధపురాజు మన్సూర్ మహమ్మద్ దేశాయ్ జల్లపల్లి ఫారం రాములు మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

.