సంస్కృతీ సంప్రదాయాల వేడుక గోరింటాకు
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కేంద్రంలో సంస్కృతీ సంప్రదాయాల ప్రాధాన్యతలో భాగంగా జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అడువాల జ్యోతి లక్ష్మణ్ అధ్యక్షతన గోరింటాకు సంబరాలు మున్సిపల్ కార్యాలయంలో మహిళా కౌన్సిలర్స్, ఆర్పీ లు ఆధ్వర్యంలో గోరింటాకు సంబురాలు నిర్వహించారు.
సంస్కృతీ సంప్రదాయాల ప్రాదాన్యతలో భాగంగా ఆషాఢ మాసం పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయంలో పెద్ద ఎత్తున మహిళలు గోరింటాకు సంబురాలు నిర్వహించామన్నారు.
ఈసందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ.
ఆషాఢ మాసానికీ, గోరింటాకుకూ విడదీయలేని అనుబంధం ఉందని, ఈ నెలలో ఒకసారైనా గోరింటాకు పెట్టుకొనే ఆనవాయితీ పూర్వకాలం నుంచీ ఉందని ఆమె పేర్కొన్నారు. వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యదాయకం ఎంతో మంచిదని ఆమె సూచించారు.
గోరింటాకు వల్ల చర్మ రోగాలు చాలా వరకు నిర్మూలించవచ్చని, ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల వారి ఇంట్లో శుభాలు జరుగుతాయని చెప్పారు. అదేవిధంగా గోరింటాకు పెట్టుకోవడం మన సాంప్రదాయమని , దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆమె తెలిపారు.
ప్రకృతి హితమైన గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చేతులు, పాదాలకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడి, వాతం తగ్గుతాయన్నారు.
ఈకార్యక్రమంలో మహిళా కౌన్సిలర్, ఆర్పీలు మెప్మా సిబ్బంది మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.