తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా బ్యూటీ పార్లర్ శిక్షణ అవగాహన సదస్సును నిర్వాకురాలు రమేష్,రామకృష్ణ నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా రమేష్ మాట్లాడుతూ... మహిళలకు బ్యూటీ పార్లర్ శిక్షణ ఇస్తూ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. శిక్షణ తరగతులు 30 రోజులు నిర్వహించడం జరుగుతుందని పాత్రికేయులతో తెలిపారు.
