కోరుట్ల శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో గోరింటాకు వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో ఆషాడ మాసం సందర్భంగా మహిళలందరూ గోరింటాకు వేడుకలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ పిల్లలు, పట్టణ ప్రజలు, ప్రతి ఒక్కరు ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా  అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని ప్రార్థించారు. 

ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి మచ్చ కవిత, 33 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి రుద్ర సుజాత,మధురిమ,కటుకం కవిత, చాప వందన, చింత రూపలత,అంజలి, లీలావతి, శశి కళ,ఆడేపు గీత,మమత, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

.