ముదిరాజులకు బిసి-డి నుండి బీసీ"ఏ"కు మార్చాలి

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో  వినతిపత్రం అందజేత.

తెలంగాణ ప్రభ (కోటగిరి):  కోటగిరి  ఉమ్మడి మండల కేంద్రంలోని ఉమ్మడి మండలాల ముదిరాజుల సంఘ అధ్యక్షులు నిరడి గంగాధర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ సునీతకు, ఆర్.ఐ. సాయిలుకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ తో కూడిన   వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ... ప్రభుత్వం  ఇచ్చినా అభయ హస్తం హామీలో  భాగంగా  ముదిరాజ్ లను బీసీ "డి" నుండి బీసీ "ఎ" కు వెంటనే మార్చి జీవో ఎంఎస్ నెంబర్ 15 ను వెంటనే అమలు  చేసి వేయి కోట్లతో ముదిరాజ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని, చెరువులు కుంటలపై ముదిరాజులకు, బెస్తాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ చట్టం అమలు చేయాలని, మత్స్యకారుల అభివృద్ధికి వివిధ రకాల పథకాలను అమలు చేసి 75% సబ్సిడీని అమలు చేసి నిధులను మంజూరు చేయాలని, 1000 కోట్లు నిధులను మంజూరు చేయాలని ఆయన  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  సంయుక్త కార్యదర్శి కోటగిరి సుదర్శన్,బాన్సువాడ డివిజన్ ఇంచార్జ్ కప్ప సాయిలు,రాములు,రమేష్, గంగాధర్, భూమన్న, గణేష్, శంకర్, కారేగం శంకర్,బజరంగ్, పొతంగల్ సాయిలు, రాములు,ఉత్తం తదితరులు పాల్గొన్నారు.

.