2014 నుంచి పెండింగ్ లో ఉన్న పంట రుణాలను కూడా మాఫీ చేయాలి

బీజేపీ మానకొండూర్ అసెంబ్లీ జాయింట్  కన్వీనర్ బత్తిని స్వామి గౌడ్

సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టతనివ్వాలి

తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట ): గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ లో ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని బీజేపీ మానకొండూర్ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్,బత్తిని స్వామిగౌడ్, అన్నారు.

ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల కాలంగా వేలాది మంది రైతుల రుణాలు సాంకేతిక కారణాల వల్ల  పంట రుణాలు మాఫీ కాక రైతులు అరిగోస పడుతన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలోపు చేసిన రుణాల్లో కూడా వేలాది మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదని చెబుతున్నారు, ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి రైతుకు రుణమాఫీ చెయ్యాలని డిమాండ్ చేశారు.

.