నూతన చట్టాలు, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కథలాపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కథలాపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ  ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు.  

డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని ఆయన సూచించారు. 

ప్రజలకు ఎల్లపుడు  అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.  

సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని  సూచించారు. 

పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడుంబా, గంజాయి నివారణకు ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని నియంత్రణకు కృషి చేయాలని ఆయన సూచించారు. 

మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా   ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

కావున ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని  డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆయన సూచించారు.

ఎస్పీ వెంట డిఎస్పి ఉమ మహేశ్వర రావు , సీ.ఐ  సురేష్ బాబు.ఎస్ఐ నవీన్ మరియు సిబ్బంది  ఉన్నారు.

.