నిరుపేద విద్యార్థికి కేంద్రమంత్రి బండి సంజయ్ చేయూత

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన పేదింటి అమ్మాయి అంగడి జ్యోత్స్నా చదువు లో తన నైపుణ్యాన్ని చాటుతూ హైదరాబాద్ లోని CBIT ఉన్నత కళాశాలలో  బీటెక్ రెండవ సంవత్సరంలో సీటు సంపాదించుకుంది. ఇటీవల  మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని కలిసి ఆమె తన చదువు కోసం LAPTOP అవసరం ఉందని, అమ్మాయి కోరగా స్పందించి ఈరోజు అమ్మాయికి ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాప్టాప్ అందించడం జరిగింది. 

ఇట్టి కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర రావు,మల్యాల మారుతి,గండ్ర విజయ్ రావు,కాసోజి ప్రతాప్,కథలాపూర్ మహేష్,రవితేజ బొర్రాగల్ల , రమేష్,కరిపె సాగర్, గంగాధర్, మనోజ్, గణేష్, కార్తీక్, గంగారెడ్డి, సతీష్ పాల్గొన్నారు.

.