డ్రగ్స్ ఫ్రీ సొసైటీ నిర్మాణంలో చేరుదాం గంజాయి మాదకద్రవ్యాల వైపు నుండి యువతను కాపాడుకుందాం : పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

డ్రగ్స్ ఫ్రీ సొసైటీ నిర్మాణంలో చేరుదాం గంజాయి మాదకద్రవ్యాల వైపు నుండి యువతను కాపాడుకుందాం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బోగోజీ. ముకేశ్ ఖన్నా ఆధ్వర్యంలో డ్రగ్స్ ఫ్రీ సొసైటీ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాల, మాధకద్రవ్యాల పట్ల కఠినంగా వ్యవహారిస్తుందని, ఎంతటి వారినైనా ఈ వ్యవహారంలో పట్టు పడితే ఉపేక్షిoచడం జరగదని,విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచిగా చదువుకోని తల్లి దండ్రులకు మంచి పేరు తేవాలని, తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ పేరిట నిరుద్యోగ యువతకు అండగా ఉండే విధంగా కార్యక్రమం రూపోందిస్తుందని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల. జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి. నాగ భూ షణం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. విజయలక్ష్మి-దేవేందేర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా డ్రగ్ ఫ్రీ సొసైటీ పేరిట పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు.

.