కోరుట్ల పట్టణంలో దేవాలయ భూములలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆపుదల చేయండి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూములు ఉన్నాయని అట్టి భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని 31వ వార్డు కౌన్సిలర్ పెండెం గణేష్ ఆరోపించారు. 

పట్టణంలోని సర్వే నెంబర్ 1399 లో 0-26 , 14 92లో 3-17, 1505 లో1-25, 1521లో 1-24 గుంటల భూమి కలదు. 

ఈ భూమిని గతంలో దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులు కొలతలు చేసి హద్దులు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.

కానీ కొందరు ఈ భూమిపై కన్నేసి ప్రక్కన ఉన్న సర్వే నెంబర్లలో ఉన్న భూములలో కొంత భూమిని కొనుగోలు చేసి, ఈ దేవాలయ భూమికి సంబంధించిన భూమిలో హద్దులు చూపిస్తూ ఆక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. దేవాలయ భూమికి సంబంధించిన భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేసి, అక్రమ నిర్మాణాలు చేసే వ్యక్తులపై మున్సిపల్ చట్ట ప్రకారము చర్యలు తీసుకోవాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించిన కౌన్సిలర్ పెండం గణేష్.

.