కోరుట్ల పట్టణంలో ఫుట్ పాత్ మీద వ్యాపారస్తులు పెట్టిన సామాన్లను తొలగించిన మున్సిపల్ అధికారులు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ ప్రజలు అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రధాన సమస్య అయిన  ఫుట్ పాత్ పై వ్యాపారస్తులు తమ వ్యాపారాలు కొనసాగించడం ద్వారా అనేక ప్రమాదాలు జరిగాయని, వాటి నివారణకు ఫుట్ పాత్ పై క్రయవిక్రయాలు కొనసాగించకూడదని అనేకమార్లు మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. 

ఇలా రోడ్లపై వారి వ్యాపారాలు కొనసాగించడం తద్వారా ప్రజలు రోడ్డుపై కొనుగోలు చేస్తూ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలకు గురికాకుండా రోడ్డు ఇరువైపులా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత తమపై ఉందని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం కోరుట్ల మున్సిపల్ అధికారులు రోడ్లు ఫుట్ పాత్ లపై ఉన్న దుకాణాలకు సంబంధించిన అక్రమంగా ఉంచిన బోర్డులను సామాగ్రిని తొలగించి స్వాధీనం చేసుకున్నారు  మళ్లీ ఇలా రోడ్డును ఆక్రమించుకొని ఫుట్ పాత్ లపై వ్యాపారాలు కొనసాగిస్తే రూ" 5,000/- జరిమానా విధిస్తూ కఠిన చర్యలు తీసుకొనబడునని  మున్సిపల్ కమిషనర్ శ్రీ బట్టు తిరుపతి, హెచ్చరించారు. 

ఇట్టి  కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి A. ప్రవీణ్ కుమార్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ R. రమ్య మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

.